బక్రీదు పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గురువారం జిల్లాలోని దర్గాలు, మసీదులు, ఈద్గాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.