కర్నూలు నగరంలోని బిర్లాగడ్డ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ నీటితొట్టిలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.