హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాధితుడు డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.