కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. బుధవారం వైద్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో, పరికరాలు, వసతులు, సిబ్బంది, క్యాన్సర్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లు, రేడియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా విభాగాల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.