కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.195 నుంచి రూ.204 మధ్యగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.215 నుంచి రూ.220 వరకు నమోదవుతోంది. గత వారాల కంటే రూ.20–30 తగ్గడం వల్ల వినియోగదారుల్లో హర్షాతిరేకం కనిపిస్తోంది. ధరలు తక్కువగా ఉండటంతో అమ్మకాలూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.