కర్నూలులోని అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆర్. హర్షిణి అలియాస్ ప్రీతి(31) అదృశ్యమైంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భర్తతో విభేదాల కారణంగా తండ్రి ఇంట్లో ఉంటున్న ఆమె ఈనెల 25న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలిసినవారు 9121101060, 7793984730 నంబర్లకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.