ఆస్తి వివాదంలో మహిళను హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హొళగుంద మండలం సులువాయికి చెందిన గాదిలింగప్ప తన 4.50 ఎకరాల భూమిని ఇద్దరు భార్యలకు పంచాలనుకున్నాడు. దీనికి అంగీకరించని మొదటి భార్య మల్లమ్మ, ఆమె కుమారులు శేకన్న, చిన్న గాదిలింగ కలిసి రెండో భార్య ఎల్లమ్మను కొడవలితో నరికి చంపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.