కర్నూలుకు చెందిన 4 ఏళ్ల అశ్వర్థ్ అనే బాలుడు డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరేళ్లు వచ్చేలోపు ఎలెవిడిస్ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఆరోగ్యం క్షీణించి మరణించే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఈ ఇంజెక్షన్ ధర రూ.26 కోట్లు కావడంతో, అతడి తల్లిదండ్రులు ఆర్థిక సహాయం కోసం దాతలు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.