Nov 08, 2025, 07:11 IST/ఉప్పల్
ఉప్పల్
ఉప్పల్ లో కానిస్టేబుల్ బలవన్మరణం
Nov 08, 2025, 07:11 IST
ఉప్పల్ మల్లికార్జున నగర్ లో నివాసం ఉంటున్న 42 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్ కు చెందిన శ్రీకాంత్, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల అక్టోబర్ 23 నుంచి విధులకు హాజరు కావడం లేదు. విధులకు హాజరు కావాలని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ నుండి ఉదయం నోటీసు కూడా పంపినట్లు సమాచారం. శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.