
హెచ్ మురవణిలో ఉచిత రక్తదాన శిబిరం
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండలం హెచ్. మురవని గ్రామంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి చిన్నయ్య, ఉప్పర నాగరాజు, ఈడిగ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 40 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న రక్తదాన శిబిరం నిర్వహించడం ఇది నాలుగోసారి అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సాగునీటి సంఘం ప్రతినిధి ఈడిగ సత్తన్నగౌడ్, ఎంపీటీసీ ఉప్పర జనార్ధన్, కురువ సంఘం మండల అధ్యక్షుడు రామలింగ తదితరులు పాల్గొన్నారు.






































