వచ్చే నెల 26న జరిగే మాక్ అసెంబ్లీకి మంత్రాలయం నియోజకవర్గం తరపున పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వీరేంద్ర ఎంపికయ్యాడు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీల్లో వీరేంద్ర విజేతగా నిలిచినట్లు ఎంఈవో రాగన్న, హెచ్‌ఎంలు, న్యాయనిర్ణేతలు తెలిపారు. గురువారం జరిగిన ఈ పోటీల్లో కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం, కౌతాళం మండలాల నుంచి 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేంద్రను అందరూ అభినందించారు.