
ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టోతో అజిత్ దోవల్ భేటీ
భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటలీలో పర్యటిస్తున్నారు. ఈ సందరభంగా రక్షణ మంత్రి గైడో క్రోసెట్టోతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ భద్రతా అంశాలు, ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, సముద్ర భద్రత, నావిగేషన్ స్వేచ్ఛ, ఇంధన, వాణిజ్య రవాణా మార్గాల రక్షణపై కీలక చర్చలు జరిగాయి. ఈ భేటీ భారత్-ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.




