పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్
విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 87 మంది
విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 65 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో పాఠశాల 75 శాతం ఉత్తీర్ణత సాధించింది. కె. ధరణీధర్ రెడ్డి 581/600, కేసీ దాదా కలందర్ 570/600, యు. సంజన 566/600 మార్కులతో పాఠశాల టాపర్లుగా నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఆర్పీ రాఘవేంద్ర అభినందించారు.