ఆర్లబండ: వైఎస్సార్సీపీ కార్యకర్త గౌళ్ల అయ్యప్ప మృతి

2చూసినవారు
ఆర్లబండ: వైఎస్సార్సీపీ కార్యకర్త గౌళ్ల అయ్యప్ప మృతి
మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని ఆర్లబండ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గౌళ్ల అయ్యప్ప (58) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తరఫున జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి పూలమాలలతో నివాళులు అర్పించి, అయ్యప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బెట్టన గౌడ, గ్రామ నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్