తుంగభద్రలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం

3చూసినవారు
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో శనివారం గల్లంతైన ఐదుగురి మృతదేహాలు ఆదివారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. సతీశ్ (35), యువన్ చంద్ర (5), ధను (23), సంధ్య (22) మృతదేహాలను ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీయగా, చివరిగా రాఘవేంద్ర (25) మృతదేహాన్ని గుర్తించారు. తహసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముగిశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శుభకార్యానికి వచ్చిన కుటుంబంలో ఈ విషాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :