మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర బుధవారం మండల విద్యా అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బూదూరు పాఠశాల భవనాల్లో పగుళ్లు, దెబ్బతిన్న పైకప్పులు, అపరిశుభ్రత విద్యార్థులకు ప్రమాదకరంగా మారాయని, వర్షాకాలంలో గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.