
9వ తరగతి విద్యార్థులకు మార్చిలోనే పదో తరగతి పాఠాలు
AP: ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులకు మార్చిలోనే పదో తరగతి పాఠాలు బోధించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 12లోపే వారికి SA-2 పరీక్షలు పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 23 వరకు పదో తరగతికి సంబంధించిన ప్రతి సబ్జెక్టులో 4 చాప్టర్లను ఉపాధ్యాయులు బోధిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దీనివల్ల వచ్చే విద్యా సంవత్సరంలో సిలబస్ త్వరగా పూర్తయి, విద్యార్థులకు ప్రిపరేషన్‌కు అధిక సమయం లభిస్తుంది.




