మంత్రాలయం: నిజాయితీ చాటుకున్న దంపతులు.. ఎస్సై అభినందనలు

58చూసినవారు
మంత్రాలయంలో శ్రీధర్ స్వామి, సుధామణి దంపతులు నిజాయితీ చాటుకున్నారు. శ్రీ పరిమళ విద్యానికేతన్ లో చదువుతున్న కైరవాడికి చెందిన గణేష్ కు చెందిన 'తల్లికి వందనం' డబ్బులు పొరపాటున సుధామణి ఖాతాలో జమ అయ్యాయి. దీంతో ఈ డబ్బులను ఎస్సై శివాంజల్ చేతుల మీదుగా శ్రీధర్ స్వామి, సుధామణి దంపతులు గణేష్ తల్లికి అందించారు. నిజాయితీ చాటుకున్న సుధామణి దంపతులను ఎస్సై శివాంజల్ అభినందించారు.