ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జనసేన ఇంచార్జి బి. లక్ష్మన్నలు శుక్రవారం కొత్త రాజముద్రతో మంజూరైన రైతు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో అధికారులతో కలిసి రైతుల సమావేశంలో పాల్గొని, మాజీ ముఖ్యమంత్రి ఫోటోతో ఉన్న పాస్‌పుస్తకాలను రద్దు చేసి, రైతుల పేరుతోనే అధికారిక పాస్‌పుస్తకాలను అందజేయడం ప్రారంభించారు. ఈ మార్పుతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.