మంత్రాలయం మండలం బూదూరులో చికెన్ షాపు వద్ద తనకు ముందు చికెన్ కావాలని వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో నరేష్ అనే యువకుడు చికెన్ కత్తితో విజయ్, చిన్న, గాబ్రేలు అనే ముగ్గురిపై దాడి చేశాడు. ఈ దాడిలో విజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో అతన్ని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నరేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.