కౌతాళం మండలం హాల్వి గ్రామంలో గురువారం రెండో రోజు నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు వల్లూరి నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి వల్లూరి పట్టాభి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కుంబలనూరు క్యాంప్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.