కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంటనహాల్ గ్రామంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో కన్నకొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. నానేసాబ్ రెండో భార్య గర్భవతి కావడంతో, పుట్టబోయే బిడ్డకు ఆస్తిలో వాటా దక్కుతుందనే భయంతో మొదటి భార్య కుమారుడు నూర్ సాబ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి నానేసాబ్‌ను కత్తితో పొడిచి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.