కౌతాళం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

5చూసినవారు
కౌతాళం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
కౌతాళం మండలం కౌతాళంకు చెందిన సౌదరి భార్గవికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 25,574 ఆర్థిక సహాయం మంజూరైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి తిక్కరెడ్డి సిఫారసు మేరకు ఈ సహాయం లభించింది. సోమవారం ఉరుకుంద ఈరన్న దేవాలయ మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చెన్న బసప్ప లబ్ధిదారురాలికి చెక్కును అందజేశారు. పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందని, అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, మంజునాథ, భీమయ్య, చంద్రప్ప పాల్గొన్నారు.