కౌతాళం: ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం: సీపీఎం

4చూసినవారు
కౌతాళం: ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం: సీపీఎం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా నాయకులు వీరశేఖర్, మల్లయ్య విమర్శించారు. సోమవారం ఉరుకుందలో కౌతాళం, కోసిగి మండలాల పార్టీ సభ్యులకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో వారు మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని ఆరోపించారు. కొత్తగా వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేయలేదని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపారని విమర్శించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you