విజయవాడలో అంగన్వాడీలు మంగళవారం కౌతాళం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ నాయకురాలు విజయలక్ష్మి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మల్లయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.