మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె. ఎస్. జవహర్, మంత్రాలయం
టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్. రాఘవేంద్ర రెడ్డి విగ్రహ ఏర్పాటుకు రూ. 1 లక్ష విరాళం అందజేశారు. నాయకులు అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.