కోసిగి: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి: ఏఐఎస్ఎఫ్

1చూసినవారు
కోసిగి: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి: ఏఐఎస్ఎఫ్
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో కోసిగి మండలంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యాసంస్థలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, పలువురు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వాటిని ఉల్లంఘిస్తూ ర్యాంకుల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్