కోసిగి: తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి

2చూసినవారు
కోసిగి: తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి
కోసిగి మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన విద్యార్థి నరసింహులు అదృశ్యమయ్యాడు. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సప్పగారి నరసారెడ్డి, నర్సమ్మ దంపతుల కుమారుడైన నరసింహులు కోసం బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9014233200, 8978750631 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్