కర్నూలు జిల్లాలో బుధవారం ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మొత్తం 17 మండలాల్లో వర్షపాతం నమోదైంది. మంత్రాలయంలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. జిల్లా సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. గత కొద్ది రోజులుగా ఉన్న ఉక్కపోత నుంచి ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి.