మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో
టీడీపీ,
వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం కోసిగిలో ధర్నాకు వెళ్తున్న
వైసీపీ కార్యకర్తలు మాధవరంలోని
టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్రరెడ్డి ఇంటి ముందు జెండాలు ప్రదర్శించి, బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో ఓ మహిళతో వాగ్వాదం జరిగింది. అనంతరం కోసిగి నుంచి తిరిగి వస్తున్న
వైసీపీ శ్రేణుల వాహనాలను
టీడీపీ కార్యకర్తలు అడ్డగించడంతో ఓ కారు, బైక్‌కు నిప్పంటించి దగ్ధం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.