జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని హౌసింగ్ లేఔట్‌ను బుధవారం పరిశీలించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె, రోడ్డు సమస్యపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హౌసింగ్ లేఔట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి, బిల్లులు సకాలంలో చెల్లించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.