తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు–2026 డిజిటల్, వర్చువల్ కార్యక్రమాలను మంత్రాలయం నియోజకవర్గంలో విజయవంతం చేయాలని
టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రాలయం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ అబ్జర్వర్ కే. సీ. హరి మాట్లాడుతూ, ఈసారి మహానాడు కార్యక్రమాలను హైబ్రిడ్ విధానంలో డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 27, 28 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించే మహానాడు కార్యక్రమాలను నియోజకవర్గంలోని అన్ని క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించారు.