శనివారం మంత్రాలయంలోని లాడ్జి నిర్వాహకులకు సీఐ పి. రామాంజులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జీల్లో బస చేసే భక్తుల వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపాలని, ప్రతి భక్తుడి పూర్తి చిరునామా వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. బలవంతపు వసూలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుని లాడ్జీలను సీజ్ చేస్తామని, అనుమతులు లేకుండా నడిపే లాడ్జీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. లాడ్జీల ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు.