ఇండియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంత్రాలయం యువత ప్రతిభ

0చూసినవారు
ఇండియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంత్రాలయం యువత ప్రతిభ
ఉదయపూర్ లో జరిగిన ఇండియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన యువ క్రీడాకారులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. చిన్న నాగయ్య స్వర్ణం, నరసింహులు రజతం, వినయ్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి కార్యాలయంలో క్రీడాకారులకు ఘన సన్మానం జరిగింది. మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి విజేతలను శాలువాలతో సత్కరించి, గ్రామీణ యువత జాతీయ స్థాయిలో రాణించడం ఆనందదాయకమని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్