మంత్రాలయం మండలం మాధవరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామానికి చెందిన లక్ష్మి(32) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. లక్ష్మీ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడతోంది. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని, విషయం ఆలస్యంగా తెలియడంతో రాత్రి మాధవరం ఎస్సై విజయ్ కుమార్ విచారణ చేపట్టారు.