మాలపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ దుకాణం దగ్ధం

2చూసినవారు
మాలపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ దుకాణం దగ్ధం
ఆదివారం, మంత్రాలయం మండలంలోని మాలపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భ్రమరాంబ మొబైల్ షాపు దగ్ధమైంది. దుకాణం యజమాని బోయ ముత్తురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో దాదాపు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లింది. దుకాణంలో ఉన్న సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సెల్‌ఫోన్ల అమ్మకం, సర్వీసింగ్ ద్వారా జీవనం సాగిస్తున్న బాధితుడు ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయినట్లు వాపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్