మూగలదొడ్డి: పేకాటలో డబ్బుల వివాదం.. యువకుడిపై కత్తితో దాడి

10చూసినవారు
మూగలదొడ్డి: పేకాటలో డబ్బుల వివాదం.. యువకుడిపై కత్తితో దాడి
కోసిగి మండలంలోని మూగలదొడ్డి గ్రామంలో సోమవారం రాత్రి పేకాట ఆడుతుండగా డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోటుకు దారితీసింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గుడిసె రాఘవేంద్ర, కోసిగి మునేష్‌తో పాటు మరికొందరు పేకాట ఆడుతుండగా వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన మునేష్ కత్తితో రాఘవేంద్ర చేతి, వెన్ను భాగాల్లో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాఘవేంద్రను కోసిగి పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :