కోసిగి మండలం దొడ్డి గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా వృద్ధులు, విధవులు, వికలాంగులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు, ప్రతి అర్హుడికి సమయానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పథకం ద్వారా ప్రతి అర్హుడికి గౌరవవంతంగా జీవన భద్రత కల్పించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.