పడేగల్లు: టిప్పర్ ఢీకొని బైక్‌ రైడర్ మృతి

3చూసినవారు
పడేగల్లు: టిప్పర్ ఢీకొని బైక్‌ రైడర్ మృతి
కోసిగి మండలంలోని పడేగల్లు గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామవరం గ్రామానికి చెందిన దుబ్బన్న అనే వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న దుబ్బన్నను టిప్పర్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్