పెద్దకడబూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం వీఆర్‌ఏలు తమ సమస్యలపై తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి వినతిపత్రం సమర్పించారు. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టమైందని, వేతనాలు పెంచి ఆదుకోవాలని, సేవా నిబంధనలు మెరుగుపరచాలని వారు కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.