పెద్దకడుబూరు: బిల్లుకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు

10చూసినవారు
పెద్దకడుబూరు: బిల్లుకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గోవింద రావు శుక్రవారం పెద్దకడుబూరు మండలం హనుమాపురంలో దీపం–2 పథకం అమలుపై పరిశీలనలో భాగంగా గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ బిల్లులో పేర్కొన్న ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బిల్లుకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు అదనపు చెల్లింపులు చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్