మంత్రాలయంలో వైభవంగా వెండి రథంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు

1చూసినవారు
మంత్రాలయంలో వైభవంగా వెండి రథంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు
శనివారం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు పాదపూజ నిర్వహించి, మూలరాములు, జయరాములు, దిగ్విజయరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో అలంకరించిన వెండి రథంపై ప్రహ్లాదరాయలను ఊరేగించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు వినిపించాయి. చివరగా ఊంజలసేవ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్