శనివారం మంత్రాలయం మండలంలోని రచ్చమర్రి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన భీమ్రావు (45) మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న భార్యకు మందులు తీసుకురావడానికి ముచ్చగిరి వెళ్తుండగా, బాట మారెమ్మ దేవాలయం వద్ద ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెల్ వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.