కర్నూలులో మాతా రమాబాయి అంబేద్కర్ 91వ వర్థంతి కార్యక్రమంలో ఆమె ఆత్మస్థైర్యం, త్యాగం మహిళలందరికీ ఆదర్శమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ, అంబేద్కర్ విజయాల వెనుక రమాబాయి త్యాగం, సహనం, ఆత్మస్థైర్యం గొప్ప పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లక్ష్మి, ఎర్రం లక్ష్మిదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.