బదినేహళ్‌లో వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చాడని కుమారుడి హత్య

4చూసినవారు
బదినేహళ్‌లో వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చాడని కుమారుడి హత్య
గత ఏడాది నవంబర్‌లో కౌతాళం మండలం బదినేహళ్‌లో జరిగిన బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, 15 ఏళ్ల కుమారుడు వీరేంద్రను తల్లి గంగమ్మ తన ప్రియుడు, మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దర్గప్పతో కలిసి కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు పిల్లల ఎదుటే ఈ దారుణానికి పాల్పడి, మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కవర్‌లో పెట్టి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జి. హొసళ్ళి శ్మశానవాటికలో పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :