జంపాపురంలో వైభవంగా సుంకులమ్మ దేవర మహోత్సవం

1చూసినవారు
జంపాపురంలో వైభవంగా సుంకులమ్మ దేవర మహోత్సవం
కోసిగి మండలం జంపాపురం గ్రామంలో బుధవారం సుంకులమ్మ దేవర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి సోదరులు, మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, సమృద్ధి కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్