మంత్రాలయం నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ ఉత్సవాలు

4చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ ఉత్సవాలు
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం డిజిటల్ మహానాడు రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రఘునాథ్ రెడ్డి, మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, యువ నాయకులు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రాలయం, కోసిగి, హాల్వి, ఉరుకుంద, పెద్దకడుబురు ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కందుకూరు ఈరయ్యకు నాయకులు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్