కోసిగి పీహెచ్‌సీ వద్ద ఉద్రిక్తత

3చూసినవారు
కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్య సేవలు అందడం లేదని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ బాధితుడు బుధవారం తీవ్ర నిరసన తెలిపాడు. తనిఖీకి వచ్చిన జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) కామేశ్వర ప్రసాద్ వాహనానికి అడ్డంగా రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్