కౌతాళం మండలం ఉరుకుంద మజరా గ్రామం ఓబులాపురంలో మంగళవారం భారీ గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడి, విద్యుత్ వైర్లు నేలపై పడటంతో ఆరేళ్ల బాలుడు హేమంత్ కుమార్ ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడికి కిందపడిన విద్యుత్ వైర్లు తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.