మంగళవారం సాయంత్రం పెద్దకడబూరులోని ఎస్సీ కాలనీలో మంచినీటి చెరువు సమీపంలో కురవ నాగన్న నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.